నీరా.. స్వామీజీలు తాగారు.. అందరూ తాగొచ్చా?

Chakravarthi Kalyan
ప్రకృతి ప్రసాదించిన వరం నీరా అంటే ఆల్కహాల్ అని దుష్ప్రచారం‌ ఉందని... అది పూర్తిగా తప్పు అని అంటున్నారు ఆబ్కారీ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్. దేశంలో తొలిసారి ఏర్పాటైన ఈ నీరా కేఫ్‌, ఫుడ్ కోర్టులను మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ కలియ తిరిగి పరిశీలించారు. ఆహ్లాదకరమైన వాతావరణం నడుమ నీరా ఉప ఉత్పత్తులు తాటి బెల్లం, స్వచ్ఛమైన తేనె, బూస్ట్, పంచదారను మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ పరిశీలించారు.

త్వరలో నీరా ఐస్‌క్రీం, తాటి ముంజల ఐస్‌క్రీం ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా నీరా శుద్ధి యంత్రాలను మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ నుంచి వచ్చిన స్వామీలు నీరా తాగారు. స్వచ్ఛమైన నీరాలో సున్న శాతం ఆల్కహాల్ ఉన్న దృష్ట్యా పుట్టిన పిల్లల నుంచి వృద్ధుల వరకు సేవించినా ఆరోగ్యంపై ఎలాంటి దుష్ఫలితాలు ఉండవని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. నీరా వేదామృతం అని శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: