నేరాల చేధనలో పోలీసుల కంటే వీళ్లే కీలకం?

Chakravarthi Kalyan
దర్యాప్తు వేగవంతంగా జరగడానికి వైజ్ఞానిక, శాస్త్రీయ ఆధారాలు ఎంతో ఉపయోగపడతాయి.  ప్రస్తుతం సైబర్ నేరాలు ఎక్కువగా పెరిగిపోయాయి. అందుకే  దర్యాప్తులో ఉపయోగపడే విధంగా ఆధారాలు సేకరించాలి. ఏదైనా కేసుకు సంబంధించి దర్యాప్తు చేసే క్రమంలో మానవ హక్కులను దృష్టిలో ఉంచుకోవాలి. ఎంత సాంకేతికత పెరిగినా, స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారుడికి సరైన గౌరవం దక్కకపోతే లాభం లేదని డీజీపీ అంజనీ కుమార్ అంటున్నారు.
ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో గతేడాది జనవరి వరకు 7186 కేసులు పెండింగ్ లో ఉండగా ఈ ఏడాది ఏప్రిల్ వరకు 2043 కేసుల వరకు తగ్గించామని డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ అధికారులను, సిబ్బందని డీజీపీ అంజనీ కుమార్ అభినందించారు.  నిందితులు పోలీసుల అదుపులో ఉన్నప్పుడు, వాళ్లను హింసించడం, లాకప్ డెత్ లాంటి ఘటనలు చోటు చేసుకుంటే సహించేది లేదని అంజనీ కుమార్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: