పిల్లలు పుట్టని దంపతులకు హరీశ్‌రావు గుడ్‌న్యూస్‌?

Chakravarthi Kalyan
ఫెర్టిలిటీ సేవలు అందించేందుకు గాంధీలో సంతాన సాఫల్య కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి హరీష్ రావు తెలిపారు. అలాగే గాంధీలో ఆర్గాన్ ట్రాన్సప్లాంటేషన్ కేంద్రాలను వేగంగా పూర్తి చేయాలని మంత్రి హరీష్ రావు వివరించారు . స్టాఫ్ నర్స్ పోస్ట్ ల భర్తీ పై చర్చించిన మంత్రి.... ఆన్ లైన్ ద్వారా పరీక్షలు నిర్వహించాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు. నిమ్స్ ఆసుపత్రి విస్తరణలో భాగంగా నిర్మించనున్న 2000 పడకల భవంతి సీఎం కేసీఆర్ త్వరలో భూమి పూజ చేయనున్నట్టు మంత్రి మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను మంత్రి హరీష్ రావు ఆదేశించారు.
నిమ్స్ నూతన భవంతి అందుబాటులోకి వస్తే మొత్తం పడకల సంఖ్య 3500 కి చేరుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. మొత్తం మూడు బ్లాక్ లలో ఒపి, ఐపీ, ఎమర్జెన్సీ సేవలు అందించనునట్టు మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. నిమ్స్ లో ఎంసీహెచ్ పనులు కూడా వేగవంతం చేయాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: