పంట నష్టపోయిన రైతులకు అండగా కాంగ్రెస్ ?
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్, మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ల నేతృత్వంలో నాలుగు కమిటీల ఏర్పాటు చేసినట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డిల ఆధ్వర్యంలో సమన్వయం కమిటీ ఏర్పాటు చేసినట్లు రేవంత్ రెడ్డి వివరించారు. క్షేత్ర స్థాయిలో పంటల నష్టం వివరాలు అంచనా వేసిన తరువాత పంట కొనుగోలు, ప్రభుత్వ నిర్లక్ష్యం తదితర అంశాలపై కమిటీలు ప్రత్యేకంగా సమావేశమై ప్రభుత్వానికి పీసీసీ నివేదిక ఇవ్వడంతోపాటు వాటిని పరిష్కరించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు.