ఆ విషయంలో బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య డ్రామా?

Chakravarthi Kalyan
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ అంశం బిఆర్ఎస్, బిజెపి మధ్య రాజకీయ డ్రామా నడుస్తుందని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి  ఆరోపించారు. చైర్మన్, సెక్రెటరీలపై చర్యలు తీసుకోకుండా కింది స్థాయి ఉద్యోగుల వరకే పరిమితం చేసే ప్రయత్నం జరుగుతుందని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి  అంటున్నారు. కేటీఆర్ చెప్పినట్లే సిట్ పని చేస్తుందని.. సిట్ కు చైర్మన్ కేటీఆర్ లా వుందని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆరోపించారు.

కేటీఆర్ కు సిరిసిల్లలో ఎంతమంది రాసింది, ఎన్ని మార్కులు వచ్చినయో ఎలా తెలుసని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి  ప్రశ్నించారు. సిట్ విచారణ చేసిన రిపోర్ట్ ...సీఎం కు లేదంటే కోర్టుకు ఇవ్వాలని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్ చేశారు. కేబినెట్ నిర్వహించి సీఎం చర్యలు తీసుకోవాలని.. బిజెపి, బిఆర్ఎస్ లమధ్య పేపర్ లీకేజ్ డ్రామా జరుగుతోందని.. అన్ని పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టామని పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అంటున్నారు. ఈనెల 18న ఇందిరా పార్క్ వద్ద  నిరసన దీక్ష చేయాలనీ నిర్ణయం తీసుకున్నామని.. రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరుతోందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

BRS

సంబంధిత వార్తలు: