సీఎం సహాయనిధి నిధుల్లో బిగ్‌ గోల్ మాల్‌?

Chakravarthi Kalyan
తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధుల్లో గోల్ మాల్‌ జరిగింది. ఈ నిధుల కోసం కొంతమంది అడ్డదారులు తొక్కి.. ఆస్పత్రుల్లో నకిలీ బిల్లులు రూపొందించి వాటితో దరఖాస్తు చేసుకున్నారు. ఈ బిల్లులపై అనుమానం వచ్చిన ముఖ్యమంత్రి సహాయ నిధి కార్యాలయానికి చెందిన అధికారులు పోలీసులకు కంప్లయింట్‌ ఇచ్చారు. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి, మిర్యాలగూడలోనూ మరో ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాహకులు దొంగ బిల్లులతో అక్రమంగా డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించారు. 30 వేల నుంచి 40వేల రూపాయల విలువ చేసే నకిలీ బిల్లులను రూపొందించినట్లు సీసీఎస్ పోలీసులు గుర్తించారు.

ఈ గోల్ మాల్‌ ఘటనలో నలుగురిపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. సచివాలయలోని రెవెన్యూ శాఖ అధికారి మూర్తి నెల క్రితం సైఫాబాద్ పోలీసులకు కంప్లయింట్‌ చేశారు. సైఫాబాద్ పోలీసులు సదరు కేసును సీసీఎస్ కు ట్రాన్స్‌ఫర్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: