తెలంగాణ ట్రాన్స్‌జెండర్ల కోసం రూ. 2 కోట్లు?

Chakravarthi Kalyan
తెలంగాణ రాష్ట్రంలోని ట్రాన్స్ జెండర్స్ సమస్యలు పరిష్కారానికి ప్రత్యేకంగా దృష్టి సారించామని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ట్రాన్స్ జెండర్స్ లో ఉన్న నైపుణ్యత కనుగుణంగా శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ వివరించారు. అలాగే ట్రాన్స్ జెండర్ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా డెస్క్ ను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు.

మంత్రి హరీష్ రావు వీరి సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం ద్వారా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జిల్లాల వారిగా ఐదు లక్షల రూపాయలను కూడా కేటాయించడం జరిగిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ వివరించారు. ఆయా డెస్క్ లను అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయడానికి గాను కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని సంబంధిత ముఖ్య కార్యదర్శికి మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. గత ప్రభుత్వాలకు ప్రస్తుత ప్రభుత్వ విధానాలకు అనేక తేడాలు ఉన్నాయన్న మంత్రి కొప్పుల ఈశ్వర్.. ప్రభుత్వం అన్ని రంగాలకు సహకారం అందించడంతో పాటు సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: