దసరా సినిమాలో ఆ సీన్‌ తొలగించాల్సిందే?

frame దసరా సినిమాలో ఆ సీన్‌ తొలగించాల్సిందే?

Chakravarthi Kalyan
దసరా సినీమాలో అంగన్‌వాడీ టీచర్‌ను దొంగగా చిత్రీకరించిన సన్నివేశాన్ని వెంటనే తొలగించాలని ఐద్వా  సంఘం డిమాండ్ చేసింది. ఉన్నత మైన టీచర్‌ ఉద్యోగాన్ని, పసిపాపలకు ఓనమాలు నేర్పే పాత్రను పోషిస్తున్న ఉపాధ్యాయురాలిని ఒక దొంగగా చిత్రీకరించడాన్ని ఐద్వా  సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అరుణ జ్యోతి, మల్లు లక్ష్మీ సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో ఖండించారు. వెంటనే ఈ చిత్రం నుండి ఆ సన్నివేశాన్ని తొలగించవలసిందిగా సెన్సార్ బోర్డును ఐద్వా  నేతలు డిమాండ్ చేశారు.

గర్భిణీ స్త్రీలకు పోషకాహారాన్ని అందించడం బస్తీల్లో ఎక్కడ, ఎంతమంది గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు, కౌమార బాలికలు ఉన్నారనే లెక్కలతో సహా డేటా తీస్తూ ప్రభుత్వం సరఫరా చేసినటువంటి కొద్దిపాటి సరుకులను అర్హులకు అందిస్తూ గౌరవ వేతనం పేరుతో శ్రమ దోపిడీకి గురవుతూ ఉన్నటువంటి మహిళలను ఈ రకంగా కించపరుస్తూ డైరెక్టర్ గారు చిత్రీకరించడాన్ని ఐద్వా తీవ్రంగా ఖండిస్తుట్లు ఐద్వా  నేతలు తెలిపారు. మరోసారి ఇటువంటివి తమ సినిమాల్లో రాకుండా జాగ్రత్త పడాలని ఐద్వా  నేతలు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు:

Unable to Load More