ఆ వ్యాధితో జాగ్రత్త.. మంచు లక్ష్మి హెచ్చరిక?
హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో జరిగిన కార్యక్రమంలో మంచు లక్ష్మి సహా ఆస్పత్రి ఎండీ భాస్కర రావు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భాస్కర రావు మాట్లాడుతూ రక్త నాళాల్లో .. ముఖ్యంగా కాళ్లలో రక్తం గడ్డలుగా మారి ఒక్కోసారి ఆ గడ్డలు రక్త నాళాల గుండి గుండెకు చేరే ప్రమాదం ఉందని అన్నారు. దీనివల్ల గుండె పోటు సమస్యలు వచ్చి వ్యక్తులు మరణించే అవకాశం ఉందని డాక్టర్ భాస్కర్ రావు తెలిపారు.