ఎంతటి మగాడికైనా పెళ్లాలే బాసులంటున్న కేటీఆర్‌?

Chakravarthi Kalyan
మమ్మల్ని తొక్కేస్తున్నారంటూ మహిళల గురించి మంత్రి కేటీఆర్ సరదాగా వ్యాఖ్యానించారు. మేం బయటకి ఎంత నటించినా మీరే బాస్ లు ఇంట్లో అంటూ ఓ కార్యక్రమంలో కామెంట్ చేసారు. ఎంత పెద్ద నేత అయినా ఇంటికి వెల్లకా బాస్ కి భయపడాల్సిందేనన్న మంత్రి కేటీఆర్ .. నా పిల్లల గురించి ఏదైనా సంబంధంగా వార్తలు వచ్చినప్పుడు నాకు బాధ అనిపిస్తుందన్నారు. తెలిసి తెలియక ఇంటి నుంచే అమ్మాయిని తక్కువ చేసి అబ్బాయికి ఎక్కువ అన్న భావన నేర్పిస్తామని.. పిల్లల్ని ఎలా పెంచుతాం అనేది ముఖ్యమని.. నన్ను నా చెల్లిని బాగా చదివించారని మంత్రి కేటీఆర్ గుర్తు చేసుకున్నారు.

నా చెల్లి యూఎస్ వెళ్తా అంటే నా కంటే ముందే పంపారని.. మా పిల్లలకు కూడా సమానంగా ట్రీట్ చేస్తున్నామని... పడిపోతే మెం ఉన్నాం అన్న ధైర్యం ఇస్తున్నామని మంత్రి కేటీఆర్  అన్నారు. నా కూతురు 9వ తరగతి చదువుతుందని.. తను మంచి ఆర్టిస్ట్ అవుతుంది అనుకుంటున్నానని.. ఆమె ఇప్పటికే ర పుస్తకాలు రాసిందని.. మ్యూజిక్ ని ఇష్టపడుతుందని మంత్రి కేటీఆర్  అన్నారు. మహిళలే ఎక్కువ నిబద్ధత, ఎక్కువ బాధ్యతాయుతంగా  వుంటారని మంత్రి కేటీఆర్  అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

KTR

సంబంధిత వార్తలు: