ఉక్రెయిన్‌ యుద్ధం: ఆ దేశానికి 14 లక్షల కోట్లు నష్టం?

Chakravarthi Kalyan
రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో తెర వెనుకే కాకుండా తెర ముందు కూడా సహాయం చేసిన యూరప్ దేశాలకి ఇప్పుడు తల నొప్పి ఎక్కువైంది. ఇప్పటికే బ్రిటన్ లో నిరసనలు, అమెరికాలో ఉద్యోగాలు పోవడం ఇలాంటి సమస్యల వల్ల యూరప్ దేశాల్లో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని ఉంది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతోంది. ఈ ద్రవ్యోల్బణం విషయంలో జర్మనీ మొదటి బాధితురాలుగా మారింది.
జర్మనీ ఇప్పుడు తాజాగా అధికారిక లెక్కలు చెప్పుకొస్తుంది. పెట్రోల్, డీజిల్ సప్లై చేసే నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ పగిలిపోవడం వల్ల వచ్చిన ఫలితం కావచ్చు, అమెరికా యూరప్ దేశాలు నెత్తిన పెట్టుకొని చూడడం వల్ల కావచ్చు, అతిగా ఉక్రెయిన్ ను సపోర్ట్ చేస్తున్న కోపంతో రష్యా కొట్టిన దెబ్బే కావచ్చు. వీటన్నిటి ఫలితంగా ఈ సంవత్సరంలో జర్మనీ కి ఏకంగా 160 బిలియన్ల యూరోలు అంటే మన భారతీయ కరెన్సీ లెక్కల ప్రకారం 14 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయినట్లు జర్మనీ చాంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ కు సంబంధించిన చీఫ్ పీటర్ ఇబ్రియా అధికారిక ప్రకటన చేశారు. ముఖ్యంగా రష్యా తో తెగతెంపులు చేసుకోవడం వల్ల ఎనర్జీ విషయంలో 40 శాతం అధిక నిధులను అధనంగా ఖర్చు చేయవలసి వస్తుంది అని ఆయన చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

WAR

సంబంధిత వార్తలు: