హైదరాబాద్‌: ఆ ఫామ్‌ హౌజుల్లో అరాచకాలు?

Chakravarthi Kalyan
హైదరాబాద్ శివార్లలోని ఫామ్‌హౌజ్‌లు, పబ్‌లపై సైబరాబాద్‌ పోలీసులు ఇటీవల ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో అనేక అరాచకాలు బయటపడుతున్నాయి. తాజాగా నిబంధనలు ఉల్లంఘించిన 3 ఫామ్‌ హౌజ్‌లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో ఆరుగురు అరెస్టు అయ్యారు. అనుమతి లేకుండా మద్యం అనుమతించినందుకు ఫామ్‌హౌజ్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మొయినాబాద్‌లోని సెలబ్రిటీ, ఎటెర్నిటీ, ముషీరుద్దీన్ ఫామ్‌హౌజ్‌లపై పోలీసులు  కేసు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన మరో రెండు పబ్‌లపై పోలీసులు  కేసు నమోదు చేసి నలుగురు అరెస్టు చేశారు. మాదాపూర్‌లోని 16 పబ్‌లపైనా పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మాదాపూర్‌లోని హార్ట్‌ కప్, బర్డ్ బాక్స్‌ పబ్‌లపై పోలీసులు  కేసు నమోదు  చేశారు. 21 ఏళ్ల లోపు వారికి మద్యం సరఫరా చేసినందుకు హార్ట్‌ కప్‌ పబ్ పై కేసు నమోదు అయ్యింది. అలాగే లైసెన్సు లేకుండా పబ్ నిర్వహిస్తున్నందుకు కూడా బర్డ్ బాక్స్ పబ్‌పై కేసు నమోదైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: