మాణిక్‌రావు ఠాక్రే చెవిలో జగ్గారెడ్డి చెప్పిందేంటి?

Chakravarthi Kalyan
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌ ఠాక్రేను జగ్గారెడ్డి కలిశారు. మర్యాదపూర్వకంగా ఇంఛార్జి ఠాక్రే ను కలశానని.. అయన ఇంచార్జి బాధ్యతలు తీసుకున్నాక కలువడం ఇదే మొదటిసారని.. అనేక రాజకీయ అంశాలు మా మధ్య చర్చకు వచ్చాయని జగ్గారెడ్డి చెప్పారు. పార్టీ అంతర్గత విషయాలు చర్చకు రాలేదంటున్న జగ్గారెడ్డి.. ఠాక్రే అనుభవం టీ కాంగ్రెస్ కు ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణ లో 70 సీట్ల కోసం పనిచేస్తామని.. కాంగ్రెస్ బలం బలహీనత ను ఠాక్రే కు వివరించానని.. చాలా మంది సీనియర్ లు పాదయాత్ర షెడ్యూల్ ఇచ్చారని జగ్గారెడ్డి తెలిపారు.

నా పాదయాత్ర రూట్ మ్యాప్ ను త్వరలో తెలియజేస్తానన్న జగ్గారెడ్డి.. కోమటిరెడ్డి చెప్పింది ఓకటైతే..మీడియా లో మరోకటి వచ్చింది... ప్రజలకు అర్థం మరోలా అయిందని అన్నారు. ఎవరు ఏం మాట్లాడినా కాంగ్రెస్ కు నష్టం జరగదని.. కోమటిరెడ్డి నష్టం జరిగేలా మాట్లాడలేదని జగ్గారెడ్డి వెనకేసుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: