కేసీఆర్‌.. తీర్మానంతోనే పని పూర్తి కాదు?

Chakravarthi Kalyan
రాష్ట్ర ప్రభుత్వం వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే..  కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాకుండా... దాన్ని పకడ్బందీగా ఆమోదం అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని వాల్మీకి, బోయ ఐక్య కార్యాచరణ కమిటీ కోరుతోంది. వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చస్తామని ఈనెల 10న ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్మానం చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఎలాంటి ఆలస్యం చేయకుండా... రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని ఆమోదించాలని కమిటీ సభ్యుడు గొంది వెంకట రమణ విజ్ఞప్తి చేస్తున్నారు.
నిన్న అసెంబ్లీ సమావేశాలు ఆఖరి రోజు కావడంతో ప్రతిపక్ష పార్టీ నాయకులు ఈ తీర్మానం పై తమ వైఖరిని స్పష్టం చేయాలని కోరారు. ఇదే విషయంపై ప్రతిపక్ష నాయకులను కలిసేందుకు కమిటీ నాయకులు అసెంబ్లీకి వచ్చారు. తమ పోరాటాల ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసిందన్నారు. ఇప్పుడు ఆమోదం పొందే వరకు కేంద్ర ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: