కోటంరెడ్డి ఫోన్‌ ట్యాపింగ్.. అనిల్ సవాల్‌?

Chakravarthi Kalyan
ఏపీ మాజీ మంత్రి, సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్‌ కోటంరెడ్డికి సవాల్ విసిరారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఫోన్ టాపింగ్ వ్యవహారంపై  స్పందించిన మాజీ మంత్రి అనీల్.. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఫోన్ టాపింగ్ జరగలేదన్నారు. ఎమ్మెల్యే కోటం రెడ్డికి  సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. ఇద్దరం ఎమ్మెల్యే పదవులకు స్పీకర్ ఫార్మేట్ లో  రాజీనామా చేసి స్పీకర్ దగ్గర వెళ్తామని.. ఫోన్ టాపింగ్ జరిగిందని నువ్వు నిరూపిస్తే నేను రాజీనామాను యాక్సెప్ట్ చేస్తానని.. ఫోన్ టాపింగ్ జరగలేదని నేను నిరూపిస్తే నువ్వు రాజీనామా యాక్సెప్ట్ చేస్తావా అని మాజీ మంత్రి అనిల్ సవాల్ విసిరారు.
24 గంటలు సమయం  ఇస్తున్నా.. మీరు ఎప్పుడైనా రండి.. నేను రెడీ.. అంటూ  మాజీ మంత్రి అనిల్ సవాల్ విసిరారు.. తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకే జగన్ మోహన్ రెడ్డి పై శ్రీధర్ రెడ్డి  ఇలాంటి విమర్శలు చేస్తున్నాడని  మాజీ మంత్రి అనిల్  అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: