ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌పై అవాకులు.. చెవాకులా?
ప్రగతిభవన్ నుండి వచ్చిన స్క్రిప్ట్ ను బాలరాజ్ తో చదివించారని... గురుకులాల్లో పేద పిల్లలను తీర్చిదిద్దిన వ్యక్తి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అని వెంకటేష్ చౌహన్ గుర్తు చేశారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ప్రవీణ్ కుమార్ ను ప్రశంసించారని... గువ్వల బాల్ రాజ్ కు అది కనపడలేదా అని వెంకటేష్ చౌహన్ ప్రశ్నించారు. భాజపా అమ్ముడుపోవడానికి సిద్ధమై అడ్డంగా దొరికిన గువ్వల బాల్ రాజ్.... స్వేరోస్ గురించి చాలా అవమానంగా మాట్లాడారని వెంకటేష్ చౌహన్ పేర్కొన్నారు. పేద పిల్లలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో గురుకుల పాఠశాలలకు వచ్చారని... ఒక్క రోజైనా సోషల్ వెల్వేర్ హాస్టళ్ళకు వెళ్లి చూశావా అని వెంకటేష్ చౌహన్ ప్రశ్నించారు.