జగన్‌కు బిగ్‌షాక్‌ ఇవ్వనున్న సొంత ఎమ్మెల్యే?

Chakravarthi Kalyan
ఏపీ సీఎం జగన్‌కు సొంత పార్టీ నేత బిగ్ షాక్‌ ఇవ్వనున్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనయనకు బిగ్ షాక్‌ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. తన ఫోన్ టాపింగ్ జరగలేదని ఆధారాలుంటే చూపాలని బాలినేని శ్రీనివాసుల రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి.. ఇవాళ ఫోన్ టాపింగ్ జరిగినట్లు నిరూపించనున్నట్టు తెలుస్తోంది. ఇవాళ ఫోన్ ట్యాపింగ్‌పై సాక్షాలతో మీడియా ముందుకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రానున్నట్టు తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ సాక్షాలను బయటపడితే ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఉద్యోగాలు పోతాయని ఇప్పటివరకు బయట పెట్టలేదంటున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. కానీ ఇప్పుడు సాక్షాలు బయట పెట్టక తప్పదంటున్నారు. వైసీపీలో అసంతృప్తులపై జరుగుతున్న ఫోన్ టాపింగ్ ప్రజలందరికీ తెలియాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంటున్నారు. మరి ఈ ట్యాపింగ్ వ్యవహారం వైసీపీలో ఎన్ని ప్రకంపనలు తెస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: