దేశంలోనే ఫస్ట్.. తెలంగాణ ఆర్టీసీ ఒప్పందం?

Chakravarthi Kalyan
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రయాణికులకు మరింత వేగంగా, నాణ్యమైన సేవలను అందించేందుకు టీఎస్‌ఆర్టీసీ కొత్త చర్యలు చేపట్టింది. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొత్త సాంకేతికతతో నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్‌ చేయాలని సంస్థ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ వీసీ సజ్జనర్‌ తలచారు. తాజాగా ఒరాకిల్‌ ఎంటర్‌ప్రైజ్‌ రిసోర్స్‌ ప్లానింగ్‌అమలు కోసం ఓ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ప‌ని చేస్తూ ప్రపంచవ్యాప్తంగా సేవ‌లు అందిస్తున్న నల్సాప్ట్‌ కంపెనీతో టీఎస్‌ఆర్టీసీ ఒక ఒప్పందం కుదుర్చుకుంది.  

ఇలా ఒప్పందం చేసుకున్న  దేశంలోని అన్ని ఎస్‌.ఆర్‌.టి.యులో ఇదే మొద‌టిది అని ఆర్టీసీ యాజమాన్యం చెబుతోంది. అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానం ద్వారా సంస్థ అంతర్గత సామర్థ్యాన్ని మెరుగుపడనుంది. రాష్ట్రంలోని డిపోలు, జోన్లతో పాటు హెడ్‌ ఆఫీస్‌లోని ఫైనాన్స్‌, హెచ్‌ఆర్‌, ఇంజనీరింగ్‌, తదితర విభాగాలను ఈఆర్‌పీ ఏకీకృతం చేస్తుంది. నల్సాప్ట్ అమలుపరిచే భాగస్వామ్యం ద్వారా..  సమర్థవంతమైన ఈ వ్యవస్థ టీఎస్‌ఆర్టీసీ అభివృద్ధికి దోహదం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

BUS

సంబంధిత వార్తలు: