
రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన జగన్ సర్కార్?
గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజుల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసినట్లు పౌర సరఫరా శాఖ ఎండీ వీరపాండియన్ వివరించారు. రైతులు తమ సొంత ఖర్చులతో గోనె సంచులు, హమాలీలు, రవాణా ఖర్చులు ఏర్పాటు చేస్తే సదరు ఖర్చులు మద్దతు ధరతో పాటు 21 రోజుల్లో చెల్లిస్తున్నట్లు పౌర సరఫరా శాఖ ఎండీ వీరపాండియన్ తెలిపారు. గోనె సంచుల చార్జీలు, హమాలీ చార్జీలు, రవాణా చార్జీల కు గాను 61.48 కోట్లకు గాను 36 శాతం అంటే 21.87 కోట్లను చెల్లించినట్లు పౌర సరఫరా శాఖ ఎండీ వీరపాండియన్ వెల్లడించారు. రైతులకు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా రైతు భరోసా కేంద్రం వద్ద అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తున్నట్లు పౌర సరఫరా శాఖ ఎండీ వీరపాండియన్ తెలిపారు.