విశాఖ ఏయిర్ పోర్ట్ లో వైఎస్ జగన్ పై జరిగిన కోడి కత్తి దాడి కేసులో ఏపీ సీఎం జగన్ కోర్టుకు రావాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్ రావు బెయిల్ పిటిషన్ ను ఎన్ ఐ ఏ కోర్ట్ కొట్టేసింది. దాడి ఘటన కేసు ను ఈ నెల 31కి తదుపరి విచారణను కోర్ట్ వాయిదా వేసింది. ఈ కేసు లో బాధితుడు జగన్ ను స్టేట్ మెంట్ ను తనకి ఇచ్చిన ఛార్జీ షీట్ కాపీలో లేదని పిటిషనర్ తరపు న్యాయవాది సలీం కోర్ట్ దృష్టికి తీసుకువెళ్లారు. బాధితుడు స్టేట్ మెంట్ తీసుకున్నామని వాటి కాపీని పిటిషనర్ న్యాయవాదికి ఇస్తామని ఎన్ ఐ ఏ న్యాయవాది కోర్ట్ కు తెలిపారు.
ఈ కేసులో బాధితుడి సాక్ష్యం కీలకమని నిబంధనల ప్రకారం వరుస క్రమంలో బాధితులు, సాక్షులందరూ కోర్ట్ కు హాజరు కావాల్సి ఉంటుందని న్యాయమూర్తి అన్నారు. నిందితులు శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం పిటిషన్ ను కొట్టేసింది. దీని ప్రకారం జగన్ కోర్టుకు రావాల్సిందేననిపిస్తోంది.