శ్రీకాకుళం సభలో హైపర్ ఆది మాట్లాడారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన తోనే పవన్ కల్యాణ్ యువశక్తి సభ నిర్వహిస్తున్నారని ఆది అన్నారు. పవన్ స్థాయి వేరు స్థానం వేరు అన్న హైపర్ ఆది... నేను సినిమా వాడిగా మాట్లాడట్లేదు.. జనసేన నాయకుడిగా మాట్లాడుతున్నానన్నారు. బిర్యాని పోట్లాల కోసం వచ్చేవారేవరు జనసేన సభలో ఉండరని...ఓడిపోతేనే... ఇంత సహాయం చేస్తున్నాడంటే.. పవన్ గెలిస్తే.. మరింత సహాయం చేస్తారన్నారు. కౌలు రౌతుల కోసం సినిమా ఓప్పుకున్న వ్యక్తి పవన్ అన్న హైపర్ ఆది... వైసీపీ వాళ్లు పవన్ కళ్యాణ్ ని తిట్టే శాఖ అని పెట్టుకోండని సలహా ఇచ్చారు. మంత్రులకు వారి శాఖలపై పది సెకన్ల కూడా మాట్లాడే స్థాయి లేదని.. వారాహి యాత్రని ఆపితే.. పవన్ పాదయాత్ర చేస్తాడు.. అప్పుడు మీకు కాశీయాత్రే అని హైపర్ ఆది సెటైర్లు వేసాడు.
పవన్ ప్రేమకు లోంగుతాడు కానీ.. ప్యాకేజ్ కాదన్న హైపర్ ఆది.. పవన్ దత్తపుత్రుడు కాదు అంజనీ పుత్రుడన్నారు. మీ పాపులారిటీ కోసం పవన్ ని విమర్శిస్తారా అన్న హైపర్ ఆది.. ఈసారి విమర్శలు చేస్తే.. జనసేన దెబ్బకు అబ్బగుర్తోస్తాడని అన్నారు. పవన్ ది నిలకడ లేని రాజకీయం కాదు నికార్సైన రాజకీయం అని.. ఓ కులాన్ని వెనకనుండి నడిపే వ్యక్తి కాదు.. అన్ని కులాలను ముందుండి నడిపే వ్యక్తి అని హైపర్ ఆది అన్నాడు.