బాబోయ్.. ఏపీలో మళ్లీ కరోనా భూతం వచ్చేసింది?

Chakravarthi Kalyan
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మూడో విడత తొలి కరోన కేసు నమోదైంది. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన బొండపల్లి మండలం గరుడుబిల్లికి చెందిన మహిళకు కరోనా సోకింది. ఈ మహిళ ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్న భర్తతో కలసి ఉంటోంది. మూడు రోజుల క్రితం.. ఆస్ట్రేలియా నుంచి సింగపూర్ మీదుగా మహిళ కుటుంబం విశాఖ విమానాశ్రయానికి వచ్చింది. విమానాశ్రయంలో కుటుంబ సభ్యులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. వాటి ఫలితాలు ఆధారంగా జిల్లా వైద్యాధికారులు తదుపరి పరీక్షలు చేపట్టారు.

కుటుంబ సభ్యుల్లో మహిళకు మాత్రమే కరోనా నిర్ధారణ అయినట్లు వైద్యులు వెల్లడించారు. కరోనా పాజిటివ్  నిర్ధారణ మహిళను హోమ్ ఐ సోలేషన్ లో ఉంచారు. కరోనా నిర్ధారణ అయిన మహిళ ఇప్పటికే మూడు డోసుల ఫైజర్ వాక్సిన్ తీసుకున్నట్లు విజయనగరం డీఏంహెచ్ఓ  రమణకుమారి వెల్లడించారు. మహిళకు సోకిన వేరియంట్ నిర్ధారణ కోసం ఆమె స్వాబ్ నమూనాలు విజయవాడకు పంపినట్లు డీఎంహెచ్ఓ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: