తెలంగాణ కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి?
వైసీపీ పార్టీ నాయకులు టీడీపీతో ఏపిలో ఉండే రాజకీయ వైరుధ్యాన్ని తమపై ఎందుకు రుద్దుతారని ఆ నేతలు ప్రశ్నించారు. తాము టీడీపీ నుంచి అధికార పార్టీ లోకి వెళ్ళలేదని, ప్రతిపక్షంలోని కాంగ్రెస్‌లోకి వచ్చామని వారు గుర్తు చేశారు. ఇలాంటి తప్పుడు రాతలు తమ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పత్రిక తెలంగాణలో కేసీఆర్‌కు అనుకూలంగా పనిచేస్తోందని, ఏపీలో జగన్ కు చంద్రబాబుపై ఉన్న అక్కసును ఇక్కడ తమపై చూపుతున్నారని వారు ఆరోపించారు.