ఖతర్నాక్ పోరి.. లవర్‌కి ఫోన్ చేసి రమ్మని.. కిడ్నాప్ డ్రామా?
అయితే అప్పుడే అనూహ్యమైన ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రేమికుడిని పెళ్లి చేసుకుని షాలిని ఏకంగా వీడియో విడుదల చేసింది. నాలుగేళ్లుగా జ్ఞానేశ్వర్‌ను ప్రేమిస్తున్నట్లు చెప్పిన షాలిని.. ఏడాది క్రితమే పారిపోయి పెళ్లి చేసుకున్నట్టు తెలిపింది. అప్పట్లో షాలిని మైనర్ కావడంతో షాలిని తల్లిదండ్రులు ప్రేమికుడిపై కిడ్నాప్ కేసు పెట్టారు. ఏడాది నుంచి వేరువేరుగా ఉంటున్న షాలిని, జ్ఞానేశ్వర్.. ఇప్పుడు షాలిని మైనారిటీ తీరడంతో ఇలా మళ్లీ పెళ్లి చేసుకున్నారు. తనకు కుటుంబసభ్యుల నుంచి ప్రాణహాని ఉందన్న షాలిని.. తమకు రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది.