కేసీఆర్‌ పై జగన్ న్యాయ పోరాటం?

Chakravarthi Kalyan
ఉమ్మడి ఆస్తుల విభజనపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసింది ఏపీ ప్రభుత్వం. సెక్షన్-9 ప్రకారం 91 సంస్థలు, సెక్షన్ 10లో చెప్పిన 142 సంస్థలతో పాటు చట్టంలో లేని 12 సంస్థ ఆస్తులు పంపిణీ చేయలేదంటుంది జగన్ ప్రభుత్వం. వీటని విభజించకపోవడం వల్ల తెలంగాణకే లాభం కలుగుతోందని వాదిస్తుంది ఏపీ సర్కారు. ఈ ఆస్తుల మొత్తం విలువ రూ.1,42,601 కోట్లు ఉంటుంది. ఈ ఆస్తుల్లో ఎక్కువ శాతం హైదరాబాద్ లోనే ఉన్నాయి.


వీటిపై ఏపీ సర్కారుకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం చెల్లించాల్సి ఉంది. దీనిపై కేంద్రం నోటీసులు ఇచ్చింది. మీటంగ్ లు పెట్టింది. అయినా లాభం లేకపోయింది. దీంతో సుప్రీం కోర్టుని ఆశ్రయించింది జగన్ ప్రభుత్వం.ఏపీకి నష్టం జరుగుతోందని పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు జాతీయ రాజకీయాలని ఢిల్లీకి వెళ్లారు కేసీఆర్. దేశ రాజకీయాలపై అంత శ్రద్ధ ఉన్న కేసీఆర్‌కు పక్కనున్న ఏపీ సంగతి మాత్రం గిట్టలేదనే వాదన వస్తోంది. ఏపీకి ఇవ్వాల్సిన పరిహారం ఇచ్చేయకుండా.. ఆ విషయాలను ఇంకా నాన్చడం వివాదాస్పదం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: