మద్యం స్కామ్‌: ఎవరినీ వదిలేది లేదట?

Chakravarthi Kalyan
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో దోషులెవరినీ వదిలేది లేదని బీజేపీ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దర్యాప్తునకు హాజరు కావాలని కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఇవ్వడంపై బీజేపీ తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ చుగ్ స్పందించారు. చట్టం ముందు అందరూ సమానులేనంటున్నారు. ఉన్నత కుటుంబంలో పుట్టినంత మాత్రాన చట్టానికి ఎవరూ అతీతులు కారని బీజేపీ తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ చుగ్ అన్నారు.
మాఫియా తరహాలో మెబైల్‌ ఫోన్లు ధ్వంసం చేశారన్న తరుణ్‌ చుగ్‌... కుటుంబ పాలనకు ఇది నిదర్శనం అని వ్యాఖ్యానించారు. పంజాబ్, తెలంగాణ, ఢిల్లీ ముఖ్యమంత్రులు మద్యం కుంభకోణంలో ఉన్నారని బీజేపీ తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. ఢిల్లీ, పంజాబ్‌లలో మద్యం విధానాల్లో అవినీతి జరిగిందని బీజేపీ తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. 'సౌత్ లిక్కర్ మాఫియా'తో దేశాన్ని దోచుకుంటున్నారని బీజేపీ తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ చుగ్ దుయ్యబట్టారు. ఢిల్లీ మద్యం విధానంపై లోతయిన దర్యాప్తు జరపాలని బీజేపీ తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ చుగ్ డిమాండ్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: