అమెరికా చేతిలో బ్రహ్మాస్త్రం.. రష్యా, చైనా హడల్ ?
ఇక ఈ స్టెల్త్ బాంబర్ వివరాల్లోకి వెళ్తే.. ఈ బీ-21 రైడర్ ను నాథ్రాప్ గ్రమ్మన్ సంస్థ తయారు చేసింది. ఒక్కో బి-21 రైడర్ ఖరీదు మన రూపాయల్లో సుమారు 17వేల కోట్లుగా ఉంటుంది. సంప్రదాయ, అణ్వాయుధాలతోపాటు లేజర్ ఆయుధాలనూ ప్రయోగించే సామర్థ్యం బీ-21 రైడర్ సొంతం. ఈ బీ-21 రైడర్.. ప్రత్యర్థులకు చిక్కకుండా, దొరకకుండా తప్పించుకుంటుంది. ప్రపంచంలో ఏ లక్ష్యాన్నైనా బీ-21 రైడర్ ఛేదించగలదు.