భూమిని మనమే నాశనం చేస్తున్నామా?
ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణపై మరోసారి చర్చ మొదలైంది. ఇలాంటి ప్రపంచ వేదికల్లో చేసే తీర్మానాలు జరుగుతున్నా.. వాటిని అమలు చేయడంలోనే అసలు చిక్కు వస్తోంది. కొన్ని దేశాల అభివృద్ధి కోసం భూగోళంపై విచ్చలవిడిగా విధ్వంసం సాగుతోంది. వనరుల వెలికితీత, దుర్వినియోగం కారణంగా మానవాళిని ప్రమాదంలో పడుతోంది. ఐరాస నివేదికల ప్రకారం- ఏటా ఒక కోటీ పదహారు వేల ఎకరాల విస్తీర్ణం మేర అడవులు ధ్వంసం అవుతున్నాయి. అంటే మన భూమిని మనమే నాశనం చేసుకుంటున్నామన్నమాట.