దారుణం: అత్యాచారం చేస్తూ వీడియో తీసి.. ఏం చేశాడంటే?

Chakravarthi Kalyan
కామాంధులు రెచ్చిపోతున్నారు. స్మార్ట్ ఫోన్లు వచ్చాక వాటిని సైతం ఆయుధాలుగా మలచుకుంటున్నారు. మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో ఓ సైకో ఓ వివాహితను రేప్‌ చేశాడు..  దారుణం ఏంటంటే.. ఆ రేప్‌ను వీడియో తీశాడు. ఓ మహిళపై ఒక సైకో అత్యాచారానికి పాల్పడి..  ఈ ఘటనను అంతా ఫోన్‌లో రికార్డు చేశాడు.. అంతే కాకుండా..  ఈ రేప్ వీడియోను ఆమె భర్తకు పంపాడు.. ఈ రేప్ వీడియో చూసిన ఆమె భర్త అది తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మహారాష్ట్రలోని పింపల్‌గావ్‌ గ్రామానికి చెందిన ఓ వివాహితను రవి దత్తాత్రేయ అనే కామాంధుడు మత్తుమందు ఇచ్చి అఘాయిత్యానికి ఒడి గట్టాడు. ఆ దారుణాన్ని మొబైల్‌ ఫోన్‌లో చిత్రీకరించాడు. అలా షూట్ చేసిన ఆ వీడియోలను ఆమె భర్తకు పంపాడు. ఈ వీడియో చూసి మనస్తాపానికి గురైన వివాహిత భర్త.. సమాజంలో పరువు పోతుందని భావించాడు. విషం తాగి తన ప్రాణాలు తీసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: