వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లకు 175 సీట్లు గెలవాల్సిందే.. ఇదే సీఎం జగన్ పార్టీ శ్రేణుల ముందు ఉంచుతున్న టార్గెట్.. ఆయన ఏమంటున్నారంటే.. మనం అనుకున్న లక్ష్యం కచ్చితంగా సాధ్యమవుతుందంటున్నారు. ఎందుకు సాధ్యం కాదని మనల్ని మనం ప్రశ్నించుకోవాలని సీఎం జగన్ సూచిస్తున్నారు. ఇంతకముందు ఎప్పుడూ జరగని విధంగా ఇవాళ పరిపాలన ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఈ లక్ష్యం సాధ్యమే అంటున్నారు. కుప్పంలాంటి నియోజకవర్గంలో కూడా క్లీన్ స్వీప్ చేశామని సీఎం జగన్ గుర్తు చేశారు.
మున్సిపాల్టీ, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్ధానాలు కూడా అన్నీ గెల్చుకున్నామని.. గతంలో రాని ఫలితాలు ఇవాళ చూస్తున్నామని.. ఇందుకు ప్రధాన కారణం ప్రతి ఇంటిలో కూడా సంక్షేమం, అభివృద్ధి అన్నది కనిపిస్తోందని సీఎం జగన్ అన్నారు. పారదర్శకంగా పథకాలు అమలవుతున్నాయని.. ప్రతి ఇంటికీ మేలు జరుగుతోందని సీఎం జగన్ అన్నారు.