జగన్ పాలనలో.. క్షోభకు గురవుతున్న రెడ్లు?
గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన వైసీపీ నేతలు లోకేష్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడారు. తాడేపల్లిలో విచ్చలవిడిగా గంజాయి, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా సీఎం పట్టించుకోవడం లేదని నారా లోకేశ్ ఆరోపించారు. గాడితప్పిన రాష్ట్రాన్ని మనందరం కలిసి దారిలో పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని లోకేశ్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ సభలో సార్ సార్ అనడం తప్ప ముఖ్యమంత్రి జగన్ ఏది సాధించలేదని నారా లోకేష్ ఆరోపించారు.