అందులో తప్పేంటి.. లోకేశ్‌కు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కౌంటర్?

Chakravarthi Kalyan
ఏపీ క్రీడాప్రాధికార సంస్థకున్న ఆర్ధిక పరిమితులను దృష్టిలో ఉంచుకునే కొన్ని మైదానాలు, కోర్టులను లీజుకు ప్రైవేటుకు ఇచ్చేందుకు నిర్ణయించినట్లు ఆ సంస్థ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి తెలిపారు. నగదు చెల్లించి, ఆడుకునే ప్లే అండ్‌ పే విధానం కొత్తది కాదని ఛైర్మన్‌ బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి అన్నారు. పది శాతం పేద క్రీడాకారులను ఉచితంగా సాధన చేసేందుకు తప్పనిసరిగా అనుమతించాలని ఆదేశించామని బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి గుర్తు చేశారు. ఎక్కడైనా ఎవరి నుంచైనా ఫిర్యాదులు ఉంటే వాటిపై విచారణ చేసి తక్షణం చర్యలు తీసుకుంటామని బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి తెలిపారు.

తమ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా టెండర్లు ఆహ్వానించి లీజు పద్ధతిన మైదానాలు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చామని   బైరెడ్డి సిద్దార్ధ తెలిపారు. గతంలోనూ ఈ విధానం కొనసాగిందని బైరెడ్డి సిద్దార్ధ తెలిపారు. శాప్‌పై నారా లోకేష్‌ చేసిన విమర్శలను బైరెడ్డి సిద్దార్ధ ఖండించారు. తమ ప్రభుత్వ హయాంలో మైదానాల అభివృద్ధి, క్రీడాకారులకు అందిస్తోన్న ప్రోత్సాహకంపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బైరెడ్డి సిద్దార్ధ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: