విశాఖకు ఐటీ కళ.. అక్టోబర్‌ నుంచి ఇన్ఫోసిస్‌?

Chakravarthi Kalyan
ఏపీలోని మెట్రో పాలిటన్ నగరం విశాఖకు కొత్త కళ రాబోతోంది. అక్టోబర్‌ 1 నుంచి విశాఖపట్నంలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ కార్యకలాపాలు ప్రారంభించబోతోంది. అక్టోబర్‌ 1 నుంచి విశాఖపట్నంలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్టు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు.
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ అక్టోబర్‌ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. తొలుత 1,000 మంది ఉద్యోగుల సామర్థ్యంతో మొదలు పెట్టి క్రమంగా 3 వేల మందికి ఉద్యోగాలు విస్తరించనున్నారు. మరో ప్రముఖ ఐటీ సంస్థ డల్లాస్‌ టెక్నాలజీస్‌ సెంటర్‌ కూడా తమ కార్యకలాపాలను విశాఖలో ప్రారంభించేందుకు సిద్ధమవుతోంద‌ని మంత్రి తన పోస్టులో తెలిపారు. సో.. విశాఖ ఏపీకి రాజధాని అయినా.. కాకపోయినా.. విశాఖ ప్రగతి విశాఖదే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: