ఆ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్న జగన్‌?

Chakravarthi Kalyan
వైఎస్‌ జగన్‌ ఎమ్మెల్యేల పని తీరుపై ఎప్పటి కప్పుడు సర్వేలు చేయించుకుంటున్నారు. తాజా సర్వేల ప్రకారం.. 27 మంది వైసీపీ ఎమ్మెల్యేల పనితీరు ఏమాత్రం బాగోలేదట. వైకాపా ఎమ్మెల్యేల్లో 27 మంది పని తీరు బాగాలేదన్న సీఎం జగన్.. తీరు మార్చుకోవాలని వారిని హెచ్చరించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సమీక్షలో ఎమ్మెల్యేల పనితీరు సర్వే నివేదిక వివరాలను ఆయన వెల్లడించారు.
జగన్ 27 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని సీఎం జగన్ తెలిపారు. పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలు తీరు మార్చుకోకుంటే సీటు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. నవంబరులో మరోసారి ఎమ్మెల్యేల పనితీరు సమీక్షిస్తానని సీఎం జగన్ తెలిపారు. అంతే కాదు.. ఎన్నికలకు 6 నెలల ముందే సీటు ఇవ్వనివారి పేర్లు ప్రకటిస్తానని ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్‌ఛార్జ్‌లకు స్పష్టం చేశారు. తనకు ఏమాత్రం మొహమాటం లేదని ఆయన తేల్చి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: