సంచలన ఆరోపణ: ఆ మంత్రి 20 కోట్లు లంచం అడిగారా?

Chakravarthi Kalyan
వినుకొండ శాసన సభ్యుడు బొల్లా బ్రహ్మ నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. గతంలో గౌతమ బుద్ధ టెక్స్ టైల్స్ అనుమతికి అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తనను 20 కోట్లు లంచం అడిగారని బొల్లా బ్రహ్మ నాయుడు అన్నారు. తనను రాజకీయ నాయకుడిగా కాకుండా పారిశ్రామికవేత్తగా చూస్తారనుకున్నానని, పార్టీ మారడంతోపాటు డబ్బు కట్టాలని ఒత్తిడి చేశారని బొల్లా బ్రహ్మ నాయుడు అన్నారు. ఒత్తిడికి తలొగ్గనందుకే అనుమతులు రద్దు చేశారని బొల్లా బ్రహ్మ నాయుడు అన్నారు.
తనను 20 కోట్లు అడిగారో లేదో మీరు ప్రమాణం చేస్తే తాను ప్రమాణం చేయడానికి సిద్ధమని బ్రహ్మనాయుడు సవాల్‌ చేశారు. గుంటూరు టెక్స్ టైల్స్ కు తనకు అసలు సంబంధమే లేదని ప్రత్తిపాటి పుల్లారావు చెబుతున్నారని.. 2012 -19 వరకూ గుంటూరు టెక్స్ టైల్స్ కు ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మ డైరెక్టర్ గా ఉన్నమాట వాస్తవం కాదా  అని బొల్లా బ్రహ్మ నాయుడు  ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: