వయస్సు 89 ఏళ్లు.. శృంగారం కోసం వేధింపులు?

Chakravarthi Kalyan
ఈ రోజుల్లో 70ఏళ్లు ఆరోగ్యంగా బతకడమే గొప్ప.. ఆపైన ఎంత కాలం బతికితే అంత బోనస్ గా చెప్పుకోవచ్చు. మరి 89 ఏళ్ల వయస్సు అంటే.. తన పనులు తాను చేసుకోవడమే కష్టంగా ఉంటుంది. కానీ.. ఓ ముసలాయన మాత్రం 89 ఏళ్ల వయస్సులో శృంగారం కోసం తపించిపోతున్నాడట. 87 ఏళ్ల తన భార్యను శృంగారం కోసం సతాయిస్తున్నాడట. 89 ఏళ్ల తన భర్త పదేపదే చేస్తున్న శృంగారం డిమాండ్లకు తట్టుకోలేకపోతున్నానంటూ సదరు 87 ఏళ్ల భార్య చివరకు హెల్ప్‌లైన్‌ను ఆశ్రయించిందట.

గుజరాత్‌లోని వదోదరలో జరిగిందీ ఘటన. దీంతో ఆ హెల్ప్‌లైన్‌ వాళ్లు ఆ 89 ఏళ్ల ముసలాయన్ను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారట. శృంగారం ఆలోచనల నుంచి దృష్టి మరల్చుకునే ఉపాయాలు కొన్ని ఆ ముసలాయనకు చెప్పారట. యోగా చేయాలని.. తీర్థయాత్రలు చేయాలని ఆ వృద్ధుడికి సూచించారట. చివరకు ఈ సూచనలు ఫలించి.. ఆ ముసలామెకు వేధింపులు తగ్గాయట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: