పాదయాత్ర కాదు.. అది అసమర్థుని అంతిమయాత్ర!?
శాంతి భద్రతల సమస్య వస్తే చంద్రబాబు బాధ్యత వహించాలన్న స్పీకర్ తమ్మినేని సీతారాం.. ఉత్తరాంధ్రకి రాజధాని వస్తే అభివృద్ధి చెందుతామన్నారు. మూడు రాజధానులు కడితే చంద్రబాబు వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించిన స్పీకర్ తమ్మినేని సీతారాం.. ముఖ్యమంత్రి జగన్ తాను ఇచ్చిన హామీలు 98.44శాతం అమలుపరిచారని కితాబిచ్చారు. కళ్యాణమస్తు, షాధీ తోఫా పథకాలను ప్రవేశపెట్టినందుకు ముఖ్యమంత్రికి ఫోన్ చేసి అభినందించానని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. కళ్యాణమస్తు, షాధీ తోఫా పథకాలు పొందాలంటే వధూవరులు ఇద్దరు 10 వ తరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణులై ఉండాలని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.