రష్యాకు ఆ దేశం సాయం.. పసిగట్టిన అమెరికా నిఘా?
ఉక్రెయిన్ పై దాడి నేపథ్యంలో అమెరికా రష్యాపై కొన్ని ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఆ ఆంక్షల కారణంగా రష్యా సైన్యానికి ఆయుధాల సరఫరాలు తగ్గిపోయాయి. ఇలాంటి సమయంలో రష్యా తన ఆయుధ అవసరాల కోసం ఉత్తర కొరియాను ఆశ్రయిస్తోందని అమెరికా భావిస్తోంది. ఉత్తర కొరియా నుంచి రష్యా అదనంగా సైనిక పరికరాలనూ కొనుగోలు చేయవచ్చని అమెరికా అంచనా వేస్తోంది.