
సజ్జల వద్దకు చేరిన శ్రీదేవి డొక్కా పంచాయతీ?
దీంతో అటు డొక్కా వర్గం.. ఇటు శ్రీదేవి వర్గం గత కొద్ది రోజులుగా పోటా పోటీ నిరసనలు, ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. దీంతో విషయం ముదురు పాకాన పడింది. తాజాగా ఎమ్మెల్యే శ్రీదేవి తాడేపల్లిలోని సజ్జల రామకృష్ణారెడ్డితో సమావేశమయ్యారు. అదనపు సమన్వయకర్తగా నియమించిన డొక్కా మాణిక్యవరప్రసాద్ ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్షురాలు మేకతోటి సుచరితను వెంటబెట్టుకొని ఆమె సజ్జలను కలిశారు. విచిత్రం ఏంటంటే.. సోమవారం ఉదయమే డొక్కా మాణిక్య వరప్రసాద్....శ్రీదేవితో కలసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు.