శ్రీలంకలో దారుణం.. ఆ దిగుమతులు నిషేధం?

Chakravarthi Kalyan
శ్రీలంక ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. విదేశీ మారక నిల్వల కొరత కారణంగా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ గడ్డు పరిస్థితి నుంచి బయటపడేందుకు శ్రీలంక తన దిగుమతులపై ఆంక్షలు విధిస్తోంది. అందులో భాగంగా చివరకు చాక్లెట్లు, సుగంధ ద్రవ్యాలు, షాంపూ వంటి వస్తువుల దిగుమతులపై ఆంక్షలు విధించింది. మొత్తం  300 రకాల వస్తువుల దిగుమతిపై నిషేధాన్ని ప్రకటించింది. ఈ మేరకు శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే గెజిట్  జారీ చేశారు.

 
ఆగస్టు 23 కంటే ముందు సరకు రవాణా జరిగితే ఓకే.. సెప్టెంబర్ 14 లోగా దేశానికి చేరుకున్న వస్తువులకు అనుమతి ఉంటుందని ఆయన తెలిపారు. 1948లో స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఈ తరహా పరిస్థితిని శ్రీలంక ఎదుర్కోవడం ఇదే మొదటిసారిగా చెబుతున్నారు. విదేశీమారక విలువ అధ్వాన్న స్థితికి చేరడంతోనే ఈ స్టెప్ తీసుకున్నారు. నిత్యావసరాల కొరత ఏర్పడి ఈ ఏడాది ప్రారంభం నుంచి ప్రజలు పెద్ద ఎత్తన నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: