'లైగర్': విజయ్ మరీ ఓవర్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడా?
అయినా చార్మీ ఈ సినిమాను ఓటీటీకి ఇవ్వలేదు. అంటే.. ఈ సినిమా అంతకు మించి థియేటర్లలో వసూలు చేయాల్సి ఉంటుంది. ఓటీటీ ఆఫర్ వచ్చినప్పుడు 200 కోట్లు చాలా తక్కువని విజయ్ దేవరకొండ స్పందించారు. కాశ్మీర్ ఫైల్స్ వంటి సినిమా కూడా 250 కోట్ల వరకూ వసూలు చేసింది. లైగర్ సినిమా కనెక్ట్ అయితే 500 కోట్ల వరకూ వసూలు చేయవచ్చని అంచనాలు ఉన్నాయి. అయితే అది హిట్ టాక్ వస్తేనే. విజయ్ దేవరకొండ మాత్రం తాను రూ.200 కోట్ల నుంచి మొదలు పెడుతున్నానని అక్కడి నుంచి వచ్చే నంబర్ నేనసలు చూడనని అన్నారు.