పవన్‌ కల్యాణ్ ఐటీ సైన్యం సత్తా ఎంతో?

Chakravarthi Kalyan
ఇప్పుడు పార్టీలకు సోషల్ మీడియా వింగ్‌లు చాలా కీలకంగా మారాయి. ప్రజాభిప్రాయాన్ని మలచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. జనసేనకు కూడా సోషల్ మీడియా వింగ్‌ యాక్టివ్‌గా ఉంటుంది. మంగళగిరి జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తాజాగా జనసేన ఐటీ సమ్మిట్ నిర్వహించారు. ఈ సమ్మిట్‌కు పవన్ కల్యాణ్, ఐటీ విభాగ  సభ్యులు, నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు.
ఈ జనసేన ఐటీ సమ్మిట్ లో 600 మంది నిపుణులు పాల్గొన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ చెయ్యని క్రియాశీల కార్యకర్తల నమోదు చేపట్టామంటున్న జనసేన నేతలు.. పార్టీ బలోపేతం కోసం పనిచేసే విభాగాల్లో ఐటీ వింగ్ కీలకమంటున్నారు. ఐటీ వింగ్ లో ఉన్న ప్రతిఒక్కరూ పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరే విధంగా పనిచేయాలని.. ఈరోజు రాజకీయాల్లో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తుందని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. అక్టోబర్ 5 నుండి పవన్ కళ్యాణ్ యాత్ర ప్రారంభిస్తారని.. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పర్యటనలు ఉంటాయని ఆయన తెలిపారు. ఏపీ పాలకులు చేసే మోసాలు, అసత్యాలను ప్రజలకు వివరించాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: