బంజారాహిల్స్ పీఎస్‌ పరిధిలో మరో రేప్‌?

Chakravarthi Kalyan
బంజారాహిల్స్ పీఎస్‌ పరిధిలో మరో రేప్‌ కేసు నమోదైంది. బాధితురాలు సోదరీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అసలేమైందంటే.. బంజారాహిల్స్ లోని దేవరకొండ బస్తీలో ఓ యువతి నివాసం ఉంటోంది. తాను నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్  సెక్యూరిటీ గార్డ్ తో గత కొంత కాలంగా బాధితురాలికి పరిచియం ఏర్పడింది.
ఈ నెల 4న ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాధితురాలిపై సెక్యూరిటీ గార్డ్ అత్యాచారం చేశాడు. విషయం బయటకి చెబితే చంపేస్తా అని బెదిరించాడు. ఈ నెల 4 వ తేదిన ఘటన జరగగా.. 5 వ తేదీన బాధితురాలు తాను చనిపోవలని ఉంది అని తన ఫ్రెండ్స్ కి మెసేజ్ చేసింది. ఆ తర్వాత విషయం కనుక్కుంటే.. అత్యాచారం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఫ్రెండ్స్ బాధితురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో ఆమె సోదరి పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. సదరు సెక్యూరిటీ గార్డ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: