ఈ విమానాల్లో లోపాలు.. ఎంత డేంజర్‌ అంటే?

Chakravarthi Kalyan
ఇటీవల స్పైస్ జెట్ , ఇండిగో సహా పలు విమానాల్లో అనేర సాంకేతిక సమస్యలు తలెత్తాయి. డీజీసీఏ ఆ సంస్థలకు షోకాజ్  నోటీసులు జారీ చేసింది. రెండు నెలల ప్రత్యేక తనిఖీలను ప్రారంభించిన డీజీసీఏ  స్పైస్ జెట్ 50 శాతం సర్వీసుల్ని నిలిపివేయాలని ఆదేశించింది. ఇటీవల కొన్ని విమానాల్లో తలెత్తిన సాంకేతిక సమస్యలపై  డీజీసీఏ చీఫ్ అరుణ్  కుమార్ స్పందించారు. ఈ లోపాలు విమాన రంగాన్ని ప్రభావితం చేసేంత తీవ్రమైనవి కాదంటున్నారు. చిన్న చిన్న సమస్యలు తలెత్తడం విమానాల్లో సాధారణమంటున్నారు. వీటి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అరుణ్ కుమార్ అన్నారు.

దేశీయ విమానాలలో ఇటీవల వెలుగుచూసిన సమస్యలే విదేశీ విమానయాన సంస్థలు కూడా తమ విమానాల్లో గుర్తించాయని అరుణ్  కుమార్ తెలిపారు. మొత్తం మీద దేశ విమానయాన రంగం సురక్షితంగా ఉందని అరుణ్  కుమార్ ధీమా వ్యక్తం చేశారు. అంతర్జాతీయ పౌరవిమానయాన సంస్థ నియమ నిబంధనలన్నింటినీ పాటిస్తున్నామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: