ఆ విషయంలో జాగ్రత్త.. జగన్ వార్నింగ్‌?

Chakravarthi Kalyan
విద్యుత్‌ రంగంపై సమీక్ష నిర్విహించిన సీఎం జగన్.. విద్యుత్‌ సరఫరా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. థర్మల్‌ కేంద్రాల వద్ద సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా చూసుకోవాలన్న సీఎం జగన్.. దీనికోసం సరైన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. విద్యుత్‌ డిమాండ్‌ అధికంగా రోజుల్లో పూర్తి సామర్థ్యంతో పవర్‌ప్లాంట్లు నడిచేలా చూసుకోవాలని అధికారులకు సూచించిన జగన్.. కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు బొగ్గు సరఫరా జరిగేలా చూసుకోవాలని సూచించారు. ఏపీఎండీసీ నిర్వహిస్తున్న సులియారీ బొగ్గు గని నుంచి మరింత మెరుగ్గా ఉత్పత్తి జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.
కొన్ని నెలల క్రితం ఏపీలో బొగ్గు కొరత కారణంగా విద్యుత్‌ కష్టాలు వచ్చిన సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత ఏపీలో విద్యుత్ కోతలు కూడా తప్పలేదు. అందుకే మళ్లీ అలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్త పడాలని సీఎం జగన్ అధికారులను హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: