కర్ణాటకలో అధికార
పార్టీ బీజేపీ యువ నేత
హత్య కలకలం సృష్టిస్తోంది. దక్షిణ
కన్నడ జిల్లాలో
భాజపా యువనేత
హత్య ప్రవీణ్ నెట్టారు
హత్య అల్లర్లకు దారి తీసింది. మంగళవారం రాత్రి అతడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ప్రవీణ్‌ను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రవీణ్ చనిపోయాడు.
ప్రవీణ్ హత్యతో
బీజేపీ నేతలు,
యువ మోర్చా నాయకులు భారీగా ఆస్పత్రి వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. రెచ్చిపోయిన నిరసనకారులు.. వాహనాలపై రాళ్లు రువ్వారు.
చివరకు పరిస్థితి అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఆస్పత్రి వద్దకు వచ్చిన
బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు, దక్షిణ
కన్నడ ఎంపీ నలిన్
కుమార్ కటీల్ కారును అడ్డుకున్నారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ హత్యపై కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రవీణ్ కుటుంబానికి సంతాపం తెలిపారు. నిందితులను పట్టుకుని చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.