సీఎంకు షాక్: బీజేపీకి టచ్లో 38 మంది ఎమ్మెల్యేలు?
శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు.. పశ్చిమ బెంగాల్లోనూ జరగొచ్చని ఆయన అంటున్నారు. దేశంలోని 18 రాష్ట్రాల్లో తమ పార్టీ అధికారంలో ఉందన్న చక్రవర్తి... అతి త్వరలో మరిన్ని రాష్ట్రాల్లోనూ కాషాయ జెండా ఎగురుతుందంటున్నారు.
అయితే.. మిథున్ చక్రవర్తి వ్యాఖ్యలను టీఎంసీ నేతలు తప్పుబడుతున్నారు. తప్పుడు ప్రకటనలతో మిథున్ చక్రవర్తి ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారంటున్నారు. పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 స్థానాలున్నాయి. అధికార టీఎంసీకి 216 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 75 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.