ఏపీకి గుడ్ న్యూస్.. ఆ రుణాలు రెడీ?

Chakravarthi Kalyan
ఆంధ్రప్రదేశ్‌లోని వైద్య కళాశాలలకు నాబార్డు రుణాలు మంజూరు చేసింది. వీటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చని నాబార్డు ఛైర్మన్ చింతల గోవిందరాజులు తెలిపారు. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు గుంటూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ విషయం తెలిపారు. వైద్య కళాశాలల నిర్మాణానికి ఇచ్చిన నిధులు ప్రభుత్వం ఎప్పుడైనా తీసుకోవచ్చని నాబార్డు ఛైర్మన్ చింతల గోవిందరాజులు తెలిపారు.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం చాలా చేస్తున్నాయని.. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయని నాబార్డు ఛైర్మన్ చింతల గోవిందరాజులు అన్నారు. వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే రైతుల తోటి వారితో కలిసి రైతు ఉత్పత్తి సంఘాలుగా మారాలని నాబార్డు ఛైర్మన్ చింతల గోవిందరాజులు సూచించారు. అప్పుడే వారికి లాభాలు వస్తాయని స్పష్టం చేశారు. కొత్త సాంకేతికతతో సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలని, పండించిన పంటను ప్రాసెసింగ్ చేసి అమ్మటం ద్వారా అదనపు ఆదాయం వస్తుందని నాబార్డు ఛైర్మన్ చింతల గోవిందరాజులు వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: