ఏపీ మరో శ్రీలంక.. ఇవే సాక్ష్యాలట?
కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే పరిస్థితి లేదన్న చంద్రబాబు...., చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు కొత్త అప్పులు చేస్తున్నారన్నారు. మలధన వ్యయం ఎక్కడా లేకపోవటంతో అభివృద్ధి కుంటబడిందని చంద్రబాబు మండిపడ్డారు. రహదారులకు మరమ్మతులు కూడా లేవని ఆగ్రహం చంద్రబాబు వ్యక్తం చేశారు. ఇవన్నీ శ్రీలంక లాంటి పరిస్థితులు కాదా అని చంద్రబాబు ప్రశ్నించారు. పోలవరం నిర్లక్ష్యం ఎవరిదో కేంద్రమే నిర్ధారించిందన్న చంద్రబాబు...., రాష్ట్ర ప్రభుత్వం పోలవరం విషయంలో తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు తెలుగుదేశంపై ఎదురుదాడి చేస్తోందన్నారు.