పోలవరం విషయంలో.. జగన్ సర్కారు కీలక నిర్ణయం?

Chakravarthi Kalyan
గోదావరి నదిలో వరద ఉగ్రరూపం దాలుస్తుండటంతో జగన్ సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ధవళేస్వరం వద్ద ప్రవాహం ఏకంగా 25 లక్షల క్యూసెక్కులకు వెళ్లే అవకాశం ఉండటంతో లంక గ్రామాలను కాపాడేందుకు పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  ఎగువ కాఫర్ డ్యామ్ ను పటిష్టపరచాలని నిర్ణయించింది. అందుకే కాదు.. దాని ఎత్తు పెంచాలని నిర్ణయించింది.


ఈమేరకు యుద్ధ ప్రాతిపదికన ఎగువ కాఫర్ డ్యామ్ ను మరో మీటరు మేర ఎత్తు పెంచేందుకు పనులు చేస్తున్నారు. మీటరు ఎత్తున, రెండు మీటర్ల వెడల్పున మట్టిని, ఇసుక బస్తాలను వేస్తున్నారు. ప్రస్తుతం ఎగువ కాఫర్ డ్యామ్ 42.5 మీటర్ల ఎత్తు ఉంది. దీన్ని మీటరు మేర ఎత్తు, రెండు మీటర్ల వెడల్పున మట్టి, ఇసుకతో గట్టిపరచాలని అధికారులు నిర్ణయించారు. ఎగువ కాఫర్ డ్యామ్, స్పిల్ వే వద్ద 20 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇది 28 లక్షల క్యూసెక్కుల వరకూ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: